మమత సర్కార్‌కు సుప్రీం షాక్

మమత సర్కార్‌కు సుప్రీం షాక్

ఢిల్లీ :  మమత సర్కార్‌కు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజీవ్ కుమార్‌ను CBI అరెస్టు చేయకుండా… తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో రాజీవ్ కుమార్ కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణ ఉంది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు CBI ప్లాన్ చేస్తోంది. బెంగాల్ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో… 15న రాజీవ్‌ కుమార్‌ను సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. గురువారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు రాజీవ్ కుమార్.