
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల(టీఎన్‌జీవో) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు . 2023 అక్టోబర్ 20న ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సంగారెడ్డికి చెందిన రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 1987లో ఉద్యోగంలో చేరిన ఆయనకు మరో రెండేళ్ల సర్వీస్ ఉంది. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగా.. గురువారం ప్రభుత్వం ఆమోదించింది. రాజేందర్‌ను పార్టీలో చేర్చుకొని సముచిత స్థానం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.