‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమితా బైజు.. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా నివిన్ పౌలీతో కలిసి ఆమె నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మూవీ అందుబాటులోకి రానుంది. ‘ప్రేమలు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గిరీశ్ ఏడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మమితా బైజు, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించగా.. సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ కీలక పాత్రల్లో కనిపించారు.
