జో బేబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో జ్యోతిక

జో బేబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో జ్యోతిక

పెళ్లి చేసుకుని, తల్లయిన తర్వాత కూడా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కొనసాగిస్తున్నవారిలో జ్యోతిక ఒకరు. ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కమర్షియల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వెలిగిన ఆమె.. సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. త్వరలో మలయాళంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ లాంటి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్ తీసిన జో బేబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో రూపొందనున్న ఈ చిత్రంలో మమ్ముటి హీరో.

త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. అంతకు కాస్త ముందు మూవీని అఫీషియల్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్ చేయబోతున్నారు. కొంతకాలంగా మమ్ముట్టి చాలా సీరియస్ కాన్సెప్టులు ఎంచుకుంటున్నారు. ఇది కూడా అలాంటి సబ్జెక్టేనని, హీరోయిన్‌‌‌‌‌‌‌‌ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో జ్యోతికను తీసుకున్నారని సమాచారం. గతంలోనూ రెండు మలయాళ చిత్రాలు చేశారు జ్యోతిక. మళ్లీ ఇన్నాళ్లకు మాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెడుతున్నారు.