
ఇల్లీగల్ గా ఎలక్ట్రానిక్ సిగరేట్స్ ను అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహమూద్ కామృద్దీన్ అనే వ్యక్తి..అబిడ్స్ బిగ్ బజార్ బిల్డింగ్ సెల్లర్ లో న్యూ గ్రాండ్ పర్ఫ్యూమ్స్ పేరుతో నిషేధిత ఈ-సిగరెట్లను అమ్ముతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాప్ పై రైడ్ చేశారు. మ్యానిఫ్యాక్చర్ డేట్ లేకుండా బ్యాన్ చేసిన నికోటిన్ ఫ్లేవర్స్ తో ఉన్న ఈ-సిగరేట్లను గుర్తించారు. మహమూద్ కామృద్దీన్ ను అదుపులోకి తీసుకుని..అతన్నుంచి సుమారు లక్ష విలువ చేసే 58 ఈ-సిగరేట్స్ మిషన్స్ ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి..మహమూద్ కామృద్దీన్ ను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.