గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

వికారాబాద్, వెలుగు: గంజాయి చాకెట్లు అమ్మతున్న వ్యక్తిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30న సాయంత్రం రైల్వే టూ వీలర్ పార్కింగ్ పరిసర ప్రాంతంలో ఎండు గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు అమ్మతున్నట్టు విశ్వసనీయమైన సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఒడిశాకు చెందిన అనీల్ కుమార్ దాస్(30) దగ్గర సోదాలు నిర్వహించగా 400 గ్రాముల గంజాయి చాక్లెట్లు, 1.9 కేజీల ఎండు గంజాయి పౌడర్ దొరికింది. అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై బి.ప్రేమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.