ఆర్నాల్డ్ బాడీ ఆశ చూపి..హైదరాబాద్ లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల దందా

ఆర్నాల్డ్ బాడీ ఆశ చూపి..హైదరాబాద్ లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల దందా
  • మాయమాటలతో ఇంజక్షన్లు అమ్ముతున్న నిందితుడు
  • అరెస్ట్​ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘ఆర్నాల్డ్​జైసా బాడీ హోనా క్యా... స్టెరాయిడ్​ఇంజక్షన్​లేలో’ అంటూ యువకులకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అమ్ముతున్న ఒకరిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. కిషన్​బాగ్​కు చెందిన ఫైజల్ ఖాన్ (25) ఫర్నిచర్ షాపులో పని చేస్తున్నాడు. బాడీ బిల్డింగ్​పై ఆసక్తి ఉండడంతో రెగ్యులర్​గా జిమ్​కు వెళ్తున్నాడు. అక్కడ పలువురు యువకులు త్వరగా మజిల్స్​పెంచాలనే కోరికతో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడుతున్నారని తెలుసుకొని క్యాష్​ చేసుకోవాలనుకున్నాడు. 

సూరత్‌‌లోని ఇండియన్ మార్ట్ నుంచి రూ.1.60 లక్షల విలువైన మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు తెప్పించాడు. వీటిని తనకు తెలిసిన యువకులకు బాడీ బిల్డింగ్​కు ఉపయోగపడుతుందని చెప్పి అమ్ముతున్నాడు. ఇవి వాడడం వల్ల హైపర్‌‌ టెన్షన్, హార్ట్​ప్రాబ్లమ్స్, అడిక్షన్ తోపాటు మరణానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. నమ్మదగిన సమాచారం మేరకు అత్తాపూర్​లోని ఏషియన్​థియేటర్ సమీపంలో ఫైజల్ ఖాన్​ను పట్టుకున్నారు. 

133  మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, 100 డిస్పోజబుల్ సిరంజీలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకన్నారు.  ఇంజెక్షన్లు వాడిన వారికి కౌన్సెలింగ్ చేసి, వైద్య సలహా తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఇన్‌‌స్పెక్టర్ చి.యాదేందర్, ఎస్‌‌ఐ ఎం.జాహెద్‌‌  పాల్గొన్నారు.