
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందింతుడిని అంకిత్ గోయల్ (33) గా గుర్తించారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో గోడలపై కేజ్రీవాల్ ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మే 19న పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో కేజ్రీవాల్ గురించి ఇంగ్లీష్ లో గోయల్ బెదిరింపు సందేశాన్ని రాశాడు. నిందితుడు రాసినదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో పోలీసులు అతన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అంకిత్ గోయెల్ బరేలీ నివాసి. బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే అతని వెనుక బీజేపీ ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది.