నకిలీ కరెన్సీ నోట్ల కేసులో పెయింటర్ అరెస్ట్

నకిలీ కరెన్సీ నోట్ల కేసులో పెయింటర్ అరెస్ట్

ముంబయిలోని మహారాష్ట్రలో నకిలీ నోట్ల కేసులో 33 ఏళ్ల పెయింటర్ హనీఫ్ షేక్‌ను మాల్వా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ.60 వేల విలువ కలిగిన నకిలీ రూ. 200 కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జప్తు చేసుకున్న నోట్లను విచారణకు పంపించి, దర్యాప్తు ప్రారంభించారు.

దేశంలో రోజురోజుకూ నకిలీ నోట్ల వ్యాపారం పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ఫ్యాక్టరీని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితుల నుంచి దాదాపు రూ.2లక్షల 10వేల విలువైన రూ.500, 200, 100 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు నకిలీ నోట్ల తయారీ ప్రింటర్ మిషన్, పేపర్స్, బ్రైట్ గ్రీన్ స్ట్రిప్ తో పాటు మూడు బైకులను అధికారులు జప్తు చేశారు.