- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: బెట్టింగ్డబ్బుల విషయంలో గొడవ పడి, ఓ వ్యక్తి గొంతు కోసిన రౌడీషీటర్‌ను బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. బోయిన్‌పల్లికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ షకీల్ ఓల్డ్ బోయిన్ పల్లి చెక్‌పోస్ట్ సమీపంలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్‌లో శుక్రవారం తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం అక్కడే ఉన్న తనకు తెలిసిన సాయికిరణ్అలియాస్బియ్యం సాయితో లూడో గేమ్‌లో రూ.500 బెట్టింగ్ పెట్టి ఓడిపోయాడు.
డబ్బులు ఇవ్వాలని సాయికిరణ్అడగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అతను తన వద్ద ఉన్న కత్తితో షేక్ షకీల్ గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గాంధీ దవాఖానకు తరలించారు. బాధితుడి కోడలు ఫర్హానా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
