జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో లోన్ కు షూరిటీ ఉండలేదని భార్య, కూతురిపై దాడి!

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో లోన్ కు షూరిటీ ఉండలేదని భార్య, కూతురిపై దాడి!
  • సుత్తితో విచక్షణారహితంగా కొట్టిన కిరాతకుడు
  •      జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దారుణం

జూబ్లీహిల్స్ , వెలుగు: అప్పుకు షూరిటీ ఉండలేదని భార్య, కూతురుపై సుత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో జరిగింది. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నివాసముంటున్న శేఖర్​కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.  అప్పు తీసుకునేందుకు  గురువారం సాయంత్రం ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుకు షూరిటీ ఉండాలని భార్యను కోరగా  ఆమె అంగీకరించలేదు.  

దీంతో ఆగ్రహానికి గురైన శేఖర్ భార్యపై కుర్చీతో దాడి చేస్తుండగా కూతురు స్నేహ అడ్డువచ్చింది. అడ్డువస్తావా అంటూ సుత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. డబ్బుల కోసం కొంతకాలంగా వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.