భార్య కాపురానికి రావ‌డంలేదంటూ గొంతు కోసుకున్న భర్త‌

భార్య కాపురానికి రావ‌డంలేదంటూ గొంతు కోసుకున్న భర్త‌

హైద‌రాబాద్: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి త‌న ఇంటికి రావడంలేదంటూ ఓ వ్య‌క్తి బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. న‌గ‌రంలోని పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలబ్ కట్ట లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ నగర్ కి చెందిన మొహమ్మద్ శబాజ్ అనే వ్య‌క్తి ఆటో డ్రైవర్ గా ప‌నిచేసేవాడు. సంవ‌త్స‌రం క్రితం భవాని నగర్ కి చెందిన బేగం తో పెద్దలు అత‌నికి పెళ్లి చేశారు. అయితే నిత్యం మద్యం , వైట్నర్ సేవించి వచ్చే శబాజ్.. భార్యని కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడంతో అత‌నిపై మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్ప‌టి నుండి పుటింట్లోనే ఆ మహిళ ఉంటోంది. శ‌నివారం తన ఇంటికి రావాలని శబాజ్ ఆమె పుట్టింటి ముందు గొడ‌వ‌ప‌డ్డాడు. భార్య మాటల విని వైట్నర్ మత్తులో బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అత‌న్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.