75 రోజుల తర్వాత ఏపీ మాజీ మంత్రి కాకాణికి బెయిల్

75 రోజుల తర్వాత ఏపీ మాజీ మంత్రి కాకాణికి బెయిల్

నెల్లూరు: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 2025, ఆగస్ట్ 18వ తేదీన కోర్టు ఆయనకు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ కోర్టుకు సరెండర్ చేయాలని స్పష్టం చేస్తూ.. లోకల్ పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలని సూచించింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మైనింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఎనిమిది కేసుల్లో ఆయనకు వరసగా బెయిల్ మంజూరై వస్తూ ఉంది.

ALSO READ : బీసీ బిల్లుకు మోదీ, కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారు

టోటల్గా 75 రోజుల తర్వాత ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించటంతో.. ఆగస్ట్ 19వ తేదీ మంగళవారం నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎనిమిది కేసులను పరిశీలిస్తే 2019 ఎన్నికల ప్రచారంలో మద్యం పంపిణీ చేశారనే ఓ కేసు కూడా ఉంది. అదే విధంగా అక్రమ మైనింగ్ కేసు ఉంది. క్వార్ట్జ్ రాయికి చెందిన క్వారీని అక్రమంగా మైనింగ్ చేశారని.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ చేసి కోట్లు సంపాదించారనే అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో బెయిల్ మంజూరు కావడంతో కాకాణికి జైలు నుంచి ఇంటికి వెళ్లే అవకాశం దక్కింది.