
జగపతిబాబు, నాగార్జున ఇద్దరూ మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాక ముందు నుంచే జగపతిబాబుకు నాగార్జున తెలుసట. అంతే కాదు ఆయన సినిమాల్లోకి రావడానికి నాగార్జునే ప్రధాన కారణమట.
ప్రస్తుతం జగపతిబాబు హోస్ట్గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి ఫస్ట్ గెస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో వైరల్గా మారింది.
కూలీ మూవీలో విలన్గా ఎందుకు చేశావంటూ జగపతిబాబు అడగడంతో నుదుటిరాత అంటూ కింగ్ నాగార్జున కూడా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
Also read:-ఎన్టీఆర్ ఇంటికొచ్చి.. ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలి
అఖిల్ మూవీలో తనను ఎందుకు వద్దన్నావని అడగ్గా అంతచిన్న పాత్ర కోసం తీసుకుంటే మన ఫ్రెండ్ షిప్ పోతుందని చెప్పాడు. దీంతో ఐలవ్ యువర్ ఎథిక్స్ అంటూ జగపతిబాబు నాగ్కి థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే, ఈ కార్యక్రమం కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు .. ఒక కొత్త ప్రయాణం. ఈ షోకు వచ్చే అతిథులు తమ మనసులోని భావాలను పంచుకోవడంతో పాటు తమ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలు, మరుపురాని ఘట్టాలను గుర్తుచేసుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోంది.
ఈ టాక్ షోకు ట్యాగ్ లైను ' చిరునవ్వులతో సాగే ఈ కొత్త ప్రయాణం' అని జోడించారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలు, వ్యక్తిగత వివరాలు, విలువైన కుటుంబం జ్ఞాపకాల గురించి పంచుకుంటారు.
నాగార్జునతో పాటు ఆయన బ్రదర్ వెంకట్, సిస్టర్ నాగ సుశీల ల సరదా సంభాషణలు, భావోద్వేగాలు ఆకట్టుకోనున్నాయి. అటు ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు , అతిథుల భావోద్వేగాలు, వారి జ్ఞాపకాలు ఆకట్టుకుంటాయని నిర్వాహకులు బలంగా నమ్ముతున్నారు.