షర్ట్ దులిపితే 14 లక్షల క్యాష్

షర్ట్ దులిపితే 14 లక్షల క్యాష్
  • తమిళనాడు నుంచి కేరళకు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

కోయంబత్తూరు: చొక్కా లోపలు నోట్ల కట్టలు దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని తమిళనాడు, కేరళ బార్డర్​లో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. వాలయార్ చెక్​పోస్ట్ వద్ద ప్యాసింజర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. కిందకు దింపి సోదా చేయగా, అతడిచొక్కా లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న ప్యాకెట్లోంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి.

నగదు మొత్తం రూ.14 లక్షలుగా తేలాయి. నిందితుడు వినో అని, తమిళనాడు నుంచి కేరళలోని త్రిసూర్​కు డబ్బు తరలిస్తున్నాడని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ క్యాష్ ఎవరిది, ఎందుకు తీసుకెళ్తున్నాడనే విషయాలు మాత్రం చెప్పలేదు. కాగా, కేరళలో లోక్​సభ ఎన్నికలకు పోలింగ్  ఈ నెల 26 న జరగనుంది. దీంతో పోలీసులు రాష్ట్ర బార్డర్​ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.