భార్య కాపురానికి రావట్లేదని టవర్ ఎక్కిండు

భార్య కాపురానికి రావట్లేదని టవర్ ఎక్కిండు
  • పురుగుల మందు డబ్బాతో  వ్యక్తి హల్ చల్ 
  • మహబూబాబాద్ జిల్లా రాజోలులో ఘటన

కురవి ,వెలుగు: భార్య కాపురానికి రావట్లేదని పురుగుల మందు డబ్బాతో వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన శెట్టి లోకేందర్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా.. వీరు హైదరాబాద్ లో జాబ్ లు చేస్తున్నారు. 

కొద్దిరోజుల కింద  పుష్ప భర్తతో గొడవ పెట్టుకొని కురవి మండలం రాజోలులోని పుట్టింటికి వెళ్లింది. భార్యకు పలుమార్లు రమ్మని భర్త ఫోన్ చేసినా వినడంలేదు. దీంతో విసుగు చెందిన భర్త ఆదివారం రాజోలుకు వెళ్లాడు. పురుగుల మందు డబ్బా పట్టుకుని సెల్ టవర్ ఎక్కాడు.  

తన భార్య కాపురానికి రావాలని మైక్ లో కోరారు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి అతనికి నచ్చజెప్పి కిందకు దింపారు. స్దానిక పెద్దలు జోక్యం చేసుకుని దంపతుల మధ్య గొడవను సద్దుమణిగించి ఇంటికి పంపించారు.