ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి  జారిపడి వ్యక్తి మృతి

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట్‌‌‌‌ లోని పొట్టి శ్రీరాములు నగర్‌‌‌‌లో ఓ వ్యక్తి ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి జారిపడి మృతిచెందాడు. గాంధీనగర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టి శ్రీరాములు నగర్‌‌‌‌ 2బీహెచ్‌‌‌‌కే ఫ్లాట్‌‌‌‌ నంబర్​713లో ల్యాగల శ్రీనివాస్‌‌‌‌(48) కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. అతను రాణిగంజ్​లో హమాలీ పని చేస్తుంటాడు. 

సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం వంట గది నుంచి బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటికే గిన్నెలు పడిన శబ్ధం రావడంతో భార్య కవిత వెళ్లి చూసేసరికి శ్రీనివాస్‌‌‌‌ గ్రౌండ్ ఫ్లోర్​లో పడిపోయాడు. అతన్ని గాంధీ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి  మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.