వీడెవండి బాబూ: 6 నిమిషాల్లో 50 వేడి మిరపకాయలు లాగించేశాడు..

వీడెవండి బాబూ: 6 నిమిషాల్లో 50 వేడి మిరపకాయలు లాగించేశాడు..

ప్రపంచంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కొందరైతే బర్గర్ తిని ..మరికొందరు మిరపకాయలు తింటూ .... రికార్డు సృష్టించారు. ఇలా రకారకాల వస్తువులు తింటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే  ఇప్పుడు తాజాగా కెనడా వ్యక్తి మైక్ జాక్ ఆరు నిమిషాల్లో ఏకంగా అత్యంత ఘాటైన 50 వేడి మిరపకాయలను తిని రికార్డ్ సృష్టించాడు. 

అన్నంలో పొరపాటున ఒక్క మిరపకాయను నమిలితే చాలు, ఆ మంటకి ఎగిరి గంతులేస్తాం. అయితే కెనడాలోని ఓ యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 వేడి మిరపకాయలను నమిలి మింగేశాడు.  అవి కూడా కేవలం   6 నిమిషాల 49.2 సెకన్లలో ఆ యువకుడు తిన్నవి అల్లాటప్పా మిరపకాయలు అనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్.. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ రకాల్లో ఒకటైన  కరోలినా రీపర్స్ మిరియాల ( హాట్ పెప్పర్) రకానికి చెందినవి.  

కెనడాలో  మైక్ జాక్ అనే వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించాడు. కేవలం   6 నిమిషాల 49.2 సెకన్లలో అత్యంత ఘాటైన 50  వేడి మిరపకాయలను క్యారట్ ముక్కలను కొరికినట్లు నమిలాడు.  వరల్డ్ రికార్డ్ సృష్టించిన తరువాత జాక్ సంతృప్తి పడలేదో ఏమో తెలియదు కాని మరో 85 మిరపకాయలను నమిలాడు.  అంటే మొత్తం 135 మిరపకాయలను నమిలి అద్వితీయమైన రికార్డ్ సృష్టించాడు. జాక్  అత్యంత ఘాటైన వేడి మిరప కాయలను తింటున్న  ( కరోలినా రీపర్స్ మిరియాల హాట్ పెప్పర్) వీడియో GWR2024OUT NOW ఖాతా నుండి సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అది కాస్త వైరల్ అయింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందించిన సమాచారం ప్రకారం ... జాక్ 20 ఏళ్ల నుంచి స్పైసీ ఫుడ్ ను తింటున్నాడు.  మొదట్లో చాలా కష్టమని అనిపించినా... ప్రపంచ రికార్డ్ సాధించేందుకు  తాను ఎంతో బాధ పడ్డానని  తెలిపారు.  మిరపకాయలు (స్పైసీ ఫుడ్) తిన్న తరువాత కడుపులో చాలా మంటగా ఉందేదని తెలిపారు.  ఇంకా స్టొమక్ లో తిమ్మరితోపాటు... పేగులను కోస్తున్న బాధగా ఉండేదన్నాడు.  ఒక్కోసారి ఇలాంటి ఫుడ్ తినడం మానేయాలనిపించేదని... కాని తన లక్ష్యం ప్రపంచ రికార్డు సాధించాలి కాబట్టి సహనంగా తాను అలాంటి బాధను అనుభవించానని తెలిపాడు జాక్.  మిరపకాయలను తిన్న తరువాత కడువులో మంటను తట్టుకోలేక చాలా నీరు త్రాగేవాడిననని.. తరువాత పంచదార వాటర్, కొబ్బరి నీళ్లు తాగి మంటను తగ్గించుకొనేవాడినని చెప్పాడు.  దీంతో జాక్ కు స్పీడ్ ఈటర్ అని బిరుదు కూడా లభించింది.  ఇంత ఘాటైన మిరపకాయలను చకచకా తినేసి రికార్డు సృష్టించిన  జాక్ ను  అక్కడి ప్రజలంతా హీరోగా పొగుడుతున్నారు.