
గుంటూరులో దారుణం జరిగింది.. ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. ఆదివారం ( ఆగస్టు 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గుంటూరులోని సాయిబాబా కాలనీ 1వ లైన్ లో చోటు చేసుకుంది ఈ దారుణం.
నరసరావుపేటకు చెందిన షేక్ యూసఫ్ భార్యతో వివాదం కారణంగా సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్యతో వివాదం వల్ల మనస్తాపానికి గురైన షేక్ యూసఫ్ ఇద్దరు పిల్లలను చంపేసి.. ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూసఫ్ మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యూసఫ్ మరణానికి అతని భార్య కారణమని ఆరోపిస్తున్నారు బంధువులు.