టాటా ఏంటి ఇదీ: షోరూం ఇచ్చిన కారుకుసొట్టలు,గీతలు..

టాటా ఏంటి ఇదీ: షోరూం ఇచ్చిన కారుకుసొట్టలు,గీతలు..

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్త కారుకు ఆర్డర్ ఇచ్చాడు. ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు..ఎప్పుడెప్పుడు కొత్త కారు డెలివరీ అవుతుందు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అనుకున్నట్లుగానే కొత్త కారు ఇంటికి చేరింది. అతడి సంతోషానికి అవుధుల్లేవు.. అయితే అతని ఉత్సాహం ఎంతో నిలవలేదు..కారును పరిశీలించిన అతనికి దిమ్మతిరిగి పోయింది.  వివరాల్లోకి వెళితే.. 

బెంగళూరుకు చెందిన శరత్ కుమార్ రూ. 18.2 లక్షలు పెట్టి టాటా నెక్సాన్  కారును కొనుగోలు చేశాడు. కొత్త కారు కొన్నాను సంబర పడుతున్న శరత్ కుమార్ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.. కారును పరిశీలిస్తే.. అన్ని డ్యామేజీలే.. దీంతో శరత్ కుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 

కారు కొన్నారు.. నా కల సాకారమైంది అని శరత్ కుమార్ అనుకుంటున్న వేళ.. డెలివరీ చేయబడిన కారును ఓసారి చెక్ చేస్తే అన్నీ సొట్టలు.. గీతలు, హెడ్ లైట్లలో వాటర్.. ఫ్రంట్ బంపర్ల పై గీతలు, క్వార్టర్ ప్యానెల్ ఫ్రేమ్, టెయిల్ గేట్  ఫ్రేమ్ తో  పాటు నాసిరకం  వెల్డింగ్ , సరిగ్గా అమర్చని డోర్ బీడింగ్ లతో సహా కారు మొత్తం అన్నీ లోపాలతో కనిపించింది. డెలివరీ ముందు చెకింగ్, నాణ్యత నియంత్రణ పరిశీలన లేకపోవడంతో వల్లే ఇలా జరిగిందని అంటున్నారు శరత్ కుమార్. 

లోపాలను గుర్తించిన శరత్ కుమార్..తాను కారు కొనుగోలు చేసిన ప్రేరణా మోటార్స్ డీలర్ షిప్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే రీప్లేస్ మెంట్, రీఫండ్ కు ప్రేరణా మోటార్స్ అంగీకరించలేదు. దానికి బదులుగా రీపేర్ చేసిన వాహనాన్ని రెండేళ్ల వారంటీ ఇస్తాం తీసుకెళ్లండి అని సూచించారు. దీనికి అంగీకరించని శరత్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ లో తన బాధను షేర్ చేసుకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharath Kumar T (@shras007)