బాత్రూంకు వెళ్లిన యువ‌కుడు.. ప్రాణ భ‌యంతో ప‌రుగులు తీశాడు

బాత్రూంకు వెళ్లిన యువ‌కుడు.. ప్రాణ భ‌యంతో ప‌రుగులు తీశాడు

మ‌నం స‌డెన్ గా వాష్ రూమ్ కి వెళ్లిన‌ప్పుడు బాత్ రూమ్ సీట్ నుంచి బ‌యంక‌ర‌మైన పాము బుస‌లు కొడుతూ బ‌య‌ట‌కు వస్తే ఎలా ఉంటుంది. ఆమ్మో అలా జ‌రుగుతుందా అని అనుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది క‌దూ. అలాంటి ఇన్సిడెంట్ నిజంగా జ‌రిగితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. గుండె జారి చేతికి వ‌స్తుంది.

అమెరికాలో టెక్సాస్ కు చెందిన ఓ యువ‌కుడు ఇంట్లో బాత్ రూమ్ కి వెళ్లాడు. అలా వెళ్లిన ఆ యువ‌కుడు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశాడు. త‌న‌ని కాపాడాలంటూ రెస్క్యూ టీమ్ కు స‌మాచారం అందించాడు.

బాత్ రూమ్ కి వెళ్లిన యువ‌కుడికి బాత్ రూమ్ సీట్ నుంచి విష‌పూరిత‌మైన పాము బుస‌లు కొడుడూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో కంగుతిన్న ఆయువ‌కుడు పాము నుంచి త‌న‌ని కాపాడాలంటా స్నేక్ రెస్క్యూ టీమ్ కు ఫోన్ చేశాడు

స‌మాచారం అందుకున్న అధికారులు బాత్ రూమ్ సీట్ నుంచి బ‌య‌ట‌కు తీసి ప‌ట్టుకొని వెళ్లారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సోష‌ల్ మీడియాలో షేర్ అయిన కొన్ని గంట‌ల్లో ఆ వీడియోని 2కోట్ల మంది నెటిజ‌న్లు వీక్షించారు.