
అమెరికా ఫోర్బ్స్ అండర్ -30 జాబితాలో చోటు సంపాదించాడు నల్లగొండకి చెందిన కోణం సందీప్. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జెర్నీ అని ఫ్రూవ్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ ను రూపొందించినందుకు గాను ఈ అరుదైన గుర్తింపు దక్కింది. పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న సందీప్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
నల్లగొండ యువకుడు కోణం సందీప్‍కు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ రూపొందించినందుకు సందీప్ కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను అత్యంత స్పష్టంగా, భద్రంగా రోగులకు ఈ యాప్ అందిస్తోంది.
వైద్య నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు రోగులు గుర్తుంచుకొని, అర్థం చేసుకొని వాటిని పాటించేలా పనిచేస్తుంది ఈ యాప్. వైద్య నిపుణులను కూడా ఈ యాప్ కి లింకేజ్ చేశారు సందీప్. దీంతో బాధితులు యాప్ , ఆన్ లైన్ లో అడిగిన వైద్య సంబంధిత సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రోగులకు వారి మాతృభాషలో సలహాలు, సూచనలు అందిస్తుంది ఈ యాప్. 2018లో డా.శివరావ్ తో కలిసి అమెరికాలోని పిట్స్ బర్గ్ లో అబ్రిడ్జ్ పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ సంస్థను సందీప్ స్థాపించారు.
వాయిస్: నల్లగొండలో 10 వరకు చదివిన సందీప్.. కడప జిల్లా ఇడుపులపాయ RGUKTలో ఇంజినీరింగ్ చేశాడు. తర్వాత అమెరికాలోని కార్నెగీ మెలన్ కాలేజీలో రోబోటిక్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు. చాలా హెల్త్ కేర్ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు. క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే క్లినికల్ ట్రయల్ మ్యాచింగ్ , పాక్షిక అంధత్వం గలవారికి ఉపయోగపడే యాప్ , బయోమెట్రిక్ పద్ధతిలో క్యాన్సర్ పరీక్ష లాంటివి ఆవిష్కరించారు.
ఫోర్బ్స్ అండర్ 30 జాబితాకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు సందీప్. తమ యాప్ అబ్రిడ్జ్ .. ఈ ఏడాది అమెరికాలో కోవిడ్ –19 వైద్య సేవలు అందించే విషయంలో మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. కోణం ఫౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపించి పేదలకు సేవ చేస్తున్నట్టు సందీప్ చెప్పాడు.
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో తమ కుమారుడికి స్థానం లభించడంపై సందీప్ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. భవిష్యత్‍లో మరిన్ని ఆవిష్కరణలు చేసి.. దేశానికి మంచి గుర్తింపు తెస్తాడని అన్నారు.
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో సందీప్ కి స్థానం దక్కడంతో నల్లగొండ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాతికేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన సందీప్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.