
హీరో విజయ్ దేవరకొండది తమ పక్క ఊరు అని.. నల్లమల్ల నుంచి వచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఇంటర్నేషన్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథతిగా హాజరైన సీఎం.. హీరో విజయ్ గురించి ఆసక్తికరమైక కామెంట్స్ చేశారు.
ఎక్కడో నల్లమల్లలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విజయ్.. సక్సెస్ అయ్యాడంటే కారణం.. అతని కఠోర శ్రమ అని అన్నారు. విజయ్ దేవర కొండ పాలమూరు నల్లమల్ల అడవి నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే.. దాని వెనుక అతని పట్టుదల, కఠోర శ్రమేనని అన్నారు. అలా సక్సెస్ కోసం కష్టపడాలని యువతకు సూచించారు. అప్పుడే సక్సెస్ అవుతారని చెప్పారు.
ALSO READ | సినిమా రోల్ కాదు.. హీరోల రియల్ లైఫ్‌ను ఆదర్శంగా తీసుకోండి: సీఎం రేవంత్
తాను కూడా కేవలం 16 సంవత్సరాల లో సీఎం స్థాయికి చేరుకున్నానని.. శ్రమ పట్టుదలే ఇందుకు కారణమని అన్నారు సీఎం. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్తాయికి చేరుకున్నానంటే.. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోవడం వల్లేనని అన్నారు. యూత్ కూడా లక్ష్యాలు పెట్టుకుని నిజాయితీగా కష్టపడాలని సూచించారు సీఎం రేవంత్.