సినిమా రోల్ కాదు.. హీరోల రియల్ లైఫ్ను ఆదర్శంగా తీసుకోండి: సీఎం రేవంత్

సినిమా రోల్ కాదు.. హీరోల రియల్ లైఫ్ను ఆదర్శంగా తీసుకోండి: సీఎం రేవంత్

హీరోలు సినిమాలో వేసే రోల్స్ కాకుండా.. వాళ్ల రియల్ లైఫ్ ను యూత్ ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ (RRR) ద్వారా ఆస్కార్ సాధించాడని.. దేశానికి గర్వకారణం అని కొనియాడారు. అవార్డు రావడానికి కారణం.. అతని కఠోరమైన శ్రమ, పట్టుదల అని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసైతే ఇలాంటి సక్సెస్ రాదని చెప్పారు. 

సినిమాల్లో హీరోలకు  పాజిటివ్.. నెగెటివ్ రోల్స్ ఉండవచ్చు.. కానీ వాళ్ల రియల్ లైఫ్ చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. ఎంతో కఠోర శ్రమ చేస్తేనే ఈస్థాయికి వస్తారని అన్నారు. వాళ్లు ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకుంటారో ఆలోచించాలని అన్నారు.  అందుకే సినిమా రోల్స్ కాకుండా వాళ్ల నిజజీవితాన్ని.. వాళ్లు ఎదిగే తీరును, సిన్సియారిటీని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. 

ALSO READ | స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే.. యాజమాన్యాలపై కేసు: సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..

అదే విధంగా విజయ్ దేవర కొండ పాలమూరు నల్లమల్ల అడవి నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే.. దాని వెనుక అతని పట్టుదల, కఠోర శ్రమేనని అన్నారు. అలా సక్సెస్ కోసం కష్టపడాలని సూచించారు. అప్పుడే సక్సెస్ అవుతారని చెప్పారు. 

తాను కూడా కేవలం 16 సంవత్సరాల లో సీఎం స్థాయికి చేరుకున్నానని.. శ్రమ పట్టుదలే ఇందుకు కారణమని అన్నారు సీఎం. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్తాయికి చేరుకున్నానంటే.. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోవడం వల్లేనని అన్నారు. యూత్ కూడా లక్ష్యాలు పెట్టుకుని నిజాయితీగా కష్టపడాలని సూచించారు సీఎం రేవంత్. 

ఈ సందర్భంగా  సీఎం రేవంత్ కామెంట్స్:

  • తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది
  • భూమి కోసం మన ఉద్యమాలు జరిగాయి
  • ఆ పోరాం నుంచే తెలంగాణ ఉద్యమం
  • రెండవ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చెప్పిన.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వినియోగిస్తే వెన్ను విరుస్తాం అని..
  • చరణ్ కు బ్యాగ్రౌండ్ ఉన్నా.. అతని తండ్రి చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా దేశం గర్వించే స్థాయికి వచ్చారంటే.. కఠోరమైన శ్రమ..
  • చిరంజీవి ఏ రోజు బాధకు కుంగిపోలేదు.. బాధతో వ్యసనాలవైపు వెళ్లలేదు
  • ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పాఠశాల నుంచి కళాశాల వరకు గంజాయి లేదా డ్రగ్స్ కు బానిసలు అవుతుంటే చూసుకుంటూ ఉందామా..?
  • 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదంటే అవమానం కాదా
  • 68 శాతం యువత ఉన్న భారత దేశం.. గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆలోచించాలి
  • గంజాయికి బానిసలం అయితే దేశం ఎదుగుతుందా
  • ఈ దేశాన్ని ఎదుర్కోలేం అని అనుకునే కొందరు.. యుద్ధం చేయొచ్చు.. కోవిడ్ పంపొచ్చు..  డ్రగ్స్ పంపొచ్చు..  ఆ ట్రాప్ లో పడదామా
  • దేశ రక్షణకు ఉక్కు కవచంలా నిలిచిన పంజాబ్ డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతోంది.. 
  • అక్కడి యువత గంజాయి, డ్రగ్స్ తో నాశనం అవుతున్నారు..
  • ఒకప్పుడు యుద్ధం అంటే పంజాబ్ వీరులు.. అలాంటి పంజాబ్ నిర్వీర్యం అవుతోంది..
  • అంటే ఎంత వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తుందో ఆలోచించండి
  • డిసెంబర్ 7న బాధ్యత తీసుకున్న తర్వాత.. మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులు దాటొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. 
  • విజయ్, రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా.. యువతకు స్ఫూర్తిగా ఉండాలని ఈ కార్యక్రమానికి వచ్చారు
  • ఏ పాలసీ లేని తెలంగాణకు స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం.. 
  • యువతను దారిలో పెట్టేందుకు.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
  • యువతకు పట్టాలు ఇస్తున్నాం కాని.. స్కిల్స్ ఇవ్వలేక పోతున్నాం
  • డిమాండ్, సప్లై.. ఫుల్ ఫిల్ చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ..
  • ఒలింపిక్స్ చూసిన తర్వాత బాధేసింది.. 
  • సౌత్ కొరియా.. హైదరాబాద్ జనాభా అంత ఉన్న ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధించింది..
  • అందులో ఒకే ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చాయి..
  • ఆ దేశంతో మనం పోటీ పడలేకపోతున్నం అంటే ఆలోచించాలి
  • ఆస్ట్రేలియా, కొరియన్ యూనివర్సిటీల నుంచి నిపుణులను రప్పించి.. ప్రపంచంలో నే స్పోర్ట్స్ లో రాణించేందుకు యువతను తయారు చేస్తాం ..
  • ప్రపంచం దేశాల నుంచి ఇక్కడికి వచ్చి శిక్షణ పొందేలా తయారు చేస్తాం
  • అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్..
  • ఇందులో భాగంగా 22 సంవత్సరాలలో 3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్లాలి
  • యువతకు శిక్షణ ఇవ్వాలి.. గొప్పవాళ్లు కావాలని ట్రై చేస్తున్నాం
  • ఇదంతా సాధించాలంటే యువత భాగస్వామ్యం అవ్వాలి
  • డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి..
  • యువత బాగుపడితే రాష్ట్రం, దేశం బాగు పడతాయి