Kannappa X Review: ‘కన్నప్ప’ X రివ్యూ.. విష్ణు, ప్రభాస్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Kannappa X Review: ‘కన్నప్ప’ X రివ్యూ.. విష్ణు, ప్రభాస్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మంచు విష్ణు కెరీర్‌లో ప్రెస్టేజియస్గా తెరకెక్కిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప నేడు (జూన్ 27న) థియేటర్లలో విడుదలైంది.

ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప టైటిల్ పాత్ర విష్ణు పోషించగా.. రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. ఓవర్సీస్లో (జూన్ 26న) కన్నప్ప రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన నెటిజన్స్ కన్నప్ప సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. పోస్టులు పెడుతున్నారు. 

లేటెస్ట్గా కన్నప్ప మూవీ చూసిన సినీ రైటర్, నిర్మాత కోనవెంకట్ తన రివ్యూను Xలో షేర్ చేశాడు. ‘కన్నప్ప మూవీని ముందుగానే చూడడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. సినిమా కంటెంట్‌ ఆసక్తికరంగా ఉంది. ఇందులో చాలా సీన్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. లాస్ట్ అరగంట సినిమాకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతారు.

ప్రభాస్‌ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. చివరి 20 నిమిషాల్లో విష్ణు తన అసాధారణ నటనను కనబరిచాడు. ప్రేక్షకులంతా ఆయన నటన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మోహన్‌బాబు కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని.. ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి మరిన్ని లాభాలు అందిస్తుందని ఆశిస్తున్నానని’’ కోన వెంకట్ తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. 

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ సైతం తన రివ్యూ పంచుకున్నాడు. "కన్నప్ప చివరి 30 నిమిషాలు నా మనసు నుండి వెళ్లడం లేదు. ఇలాంటి ఇంటెన్స్ ఉన్న ఫిల్మ్ చూసి చాల కాలం అయింది. ఇంతటి గొప్ప అనుభూతి నాకు కాంతార క్లైమాక్స్ సమయంలోనే కలిగింది. ఇప్పుడు మళ్ళీ కన్నప్పతో మంత్రముగ్దుడ్నియ్యా. ముఖ్యంగా శివ భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేదిగా, భావోద్వేగభరితంగా, గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంది" అని సుమిత్ X లో ట్వీట్ చేశాడు.

అతడు అంతటితో ఆగలేదు. ఈ మూవీలోని బలహీనతలను కూడా చెప్పుకొచ్చాడు. "మొత్తంగా, కన్నప్ప ఒక మంచి సినిమా. అయితే స్లో నేరేషన్ కాస్తా ఇబ్బంది కలిగిస్తోంది. నిర్మాణ విలువలు కూడా అంత గొప్పగా లేవు. కానీ, విష్ణు చిరస్మరణీయమైన నటనతో పాటు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ (శివుడి పాత్రలో), ప్రభాస్ (రుద్రుడి పాత్రలో) నటించిన చివరి 40 నిమిషాలు మాత్రం తప్పకుండా చూడదగ్గవి" అని సుమిత్ అన్నాడు.

ఒక నెటిజన్ తన రివ్యూను పంచుకుంటూ.. "విష్ణు మంచు తన కెరీర్ లో అత్యుత్తమ నటనను ప్రదర్శించాడు. ప్రభాస్ అతిధి పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మోహన్ లాల్ పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉంటాయి. ప్రేక్షకులకు తన పాత్రతో ఆశ్చర్యాన్ని చూస్తారు. BGM & ఎలివేషన్స్ టాప్-క్లాస్. క్లైమాక్స్ అనేది ఒక స్వచ్ఛమైన భావోద్వేగం. మిమ్మల్ని కన్నీళ్లతో నింపుతుంది" అని అన్నారు.

మరో నెటిజన్ తన రివ్యూను షేర్ చేస్తూ.. 'కన్నప్ప ప్రీ-ఇంటర్వెల్ సెకండాఫ్ పై అంచనాలు పెంచింది. సెకండాఫ్ కి వచ్చేసరికి ప్రతిఒక్కరూ తమ నటనతో ప్రాణం పోశారు. ప్రభాస్ అద్భుతమైన & ఉత్కంఠభరితమైన అతిధి పాత్ర చేశారు. విష్ణు అమాయక భక్తి & శాశ్వతమైన సనాతన ధర్మ విలువలతో సినిమా నిండి ఉంది. చాలా బాగా చేసారు. ఓం నమః శివాయ' అని పోస్ట్ పెట్టారు.