IND vs ENG: రేపటి నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మహిళల సమరం.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు!

IND vs ENG: రేపటి నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మహిళల సమరం.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు!

ఇంగ్లాండ్ మహిళలతో జరగబోయే వైట్ బాల్ ఫార్మాట్ కోసం భారత మహిళలు సిద్ధమవుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఉమెన్స్ 5 టీ20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడతారు. శనివారం (జూన్ 28) ఇరు జట్ల మధ్య  నాటింగ్‌హామ్ వేదికగా తొలి టీ20 తో ఈ టూర్ ప్రారంభమవుతుంది. జూలై 12 న జరగబోయే ఐదో టీ20 తో ఈ ఫార్మాట్ ముగిస్తుంది. జూలై 16 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జూలై 19.. జూలై 22 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.   

ప్రస్తుతం భారత మెన్స్ జట్టు ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. టీమిండియా  అండర్ 19 యువ జట్టు కూడా ఇంగ్లాండ్ లయన్స్ తో మ్యాచ్ లు ఆడేందుకు ఇంగ్లాండ్ లోనే ఉండడం విశేషం. భారత మహిళల జట్టుకు రెండు ఫార్మాట్ లలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టును నాట్ స్కైవర్-బ్రంట్ నడిపిస్తుంది. మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఫ్యాన్‌కోడ్ లో లైవ్ చూడొచ్చు.   
  
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య షెడ్యూల్:  

28 జూన్ 2025

మొదటి టీ20

వేదిక: నాటింగ్‌హామ్

సమయం: భారత కాలమాన ప్రకారం సాయంత్రం 07:00


1 జూలై 2025

2వ టీ20

వేదిక: బ్రిస్టల్

సమయం: భారత కాలమాన ప్రకారం రాత్రి 11:00 

4 జూలై 2025

3వ టీ20

వేదిక: లండన్

సమయం: భారత కాలమాన ప్రకారం రాత్రి 11:00 


9 జూలై 2025

4వ టీ20

వేదిక: మాంచెస్టర్

సమయం: భారత కాలమాన ప్రకారం రాత్రి 11:00 

12 జూలై 2025

5వ టీ20

వేదిక: బర్మింగ్‌హామ్

సమయం: భారత కాలమాన ప్రకారం రాత్రి 11:00 

16 జూలై 2025

1వ వన్డే

వేదిక: సౌతాంప్టన్

సమయం: భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు  

19 జూలై 2025

2వ వన్డే

వేదిక: లండన్

సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు   

22 జూలై 2025

3వ వన్డే

వేదిక: చెస్టర్-లె-స్ట్రీట్

సమయం: భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు  

2025 ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు అంతా


భారత మహిళల వన్డే జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, తేజల్ హసాభిస్, అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, ప్రతీకా రావల్, సయాలీ సత్‌ఘరే, స్నేహ రాణా, రిచా ఘోష్, యాస్తికా భాటియా, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్, రాధాని చరంద్,

భారత మహిళల టీ20 జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, సయాలీ సత్‌ఘరే, స్నేహ రాణా, రిచా ఘోష్, యాస్తికా భాటియా, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్, రాధా చరణి, శ్రీ

మహిళల టీ20లకు ఇంగ్లాండ్ జట్టు

ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony LIV (@sonylivindia)