పెండ్లి పత్రికలో మోడీ పేరు: ఈసీ నోటీసులు

పెండ్లి పత్రికలో మోడీ పేరు: ఈసీ నోటీసులు

డెహ్రాడూన్‌: ప్రియతమ నేతపై అభిమానం చూపించుకోవాలనుకున్న ఓ కుటుంబానికి చే దు అనుభవం ఎదురైంది. తమ ఇంట్లో జరిగే పెండ్లి కి అతిథులెవరూ బహుమతులు తేవొద్దని , బదులుగా నరేంద్ర మోడీకి ఓటువేయాలని పెండ్లి పత్రికలో ముద్రించడం వివాదాస్పదమైంది. ఈసీ ఆ ఫ్యా మిలీకి నోటీసులిచ్చేదాకా పోయింది. ఉత్తరాఖండ్ లో చోటుచేసు కున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే, జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి మోడీకి వీరాభిమాని. ఇటీవలే కొడుకు పెండ్లికి ముహుర్తం ఖరారు చేశాడు. పెండ్లి పత్రికపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘గిఫ్టులు వద్దు, మోడీకి ఓటేస్తే చాలు’అని రాయించాడు. ఇలా చేయడం కోడ్ ఉల్లం ఘన కిందికి వస్తుందన్న ఎన్నికల అధికారి, సంజాయిషీ ఇవ్వాలంటూ జోషీ ఫ్యా మిలీకి నోటీసులు పంపారు.