
- బోనాల సందర్భంగా మహిళలతో అసభ్య ప్రవర్తన
- 478 మందిలో 92 మంది మైనర్లే
- అసభ్యంగా తాకుతూ పైశాచికానందం
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీటీమ్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుందామని వచ్చిన ఆడపడుచులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిల ఆట కట్టించాయి షీ టీమ్స్.. అయితే, ఇందులో మైనర్లే వంద మంది వరకు ఉండడం గమనార్హం. మహిళలతో వారి అనుచిత చేష్టలను వీడియో తీసి మరీ రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి షీటీమ్స్. గోల్కొండ, బల్కంపేట్, లష్కర్బోనాల సందర్భంగా పిచ్చి చేష్టలు చేస్తున్న 478 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 92 మంది మైనర్లు, 386 మంది మేజర్లు ఉన్నారు. 288 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి, రూ.1,050 జరిమానా విధించారు. మరో ఐదుగురిని జైలుకు పంపారు.
14 ప్రత్యేక బృందాలు నిఘా ..
సిటీలోని సుమారు 1,405 పబ్లిక్‌ప్లేసుల్లో షీటీమ్స్నిఘా పెట్టింది. పండుగలు, పబ్లిక్గ్యాదరింగ్స్, ఇతర ప్రత్యేక సందర్భాల్లో షీటీమ్స్ ఇక్కడమఫ్టీలో ఉంటాయి. ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు సీక్రెట్కెమెరాలతో డ్యూటీ చేస్తుంటారు. ఇలా మొహర్రం, బోనాల సందర్భంగా 14 షీ టీమ్స్ పని చేసి 478 మందిని పట్టుకున్నాయి.