సీమెన్స్ కోసం ప్రొడక్షన్ యూనిట్.. ప్రారంభించిన ఆజాద్ ఇంజినీరింగ్

సీమెన్స్ కోసం ప్రొడక్షన్ యూనిట్.. ప్రారంభించిన ఆజాద్ ఇంజినీరింగ్

హైదరాబాద్​, వెలుగు:  సీమెన్స్ ఎన‌‌‌‌ర్జీ కోసం ఆజాద్ ఇంజినీరింగ్ ఒక ప్రత్యేక ఉత్పాద‌‌‌‌క కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లోని తునికిబొల్లారంలో 7,200 చ‌‌‌‌ద‌‌‌‌ర‌‌‌‌పు మీట‌‌‌‌ర్ల విస్తీర్ణంలో ఉంది.  ఈ ఉత్పాద‌‌‌‌క కేంద్రం ఆజాద్, సీమెన్స్ ఎన‌‌‌‌ర్జీ మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తరణను సూచిస్తుంది. 

ఈ యూనిట్​ను సీమెన్స్ ఎనర్జీకి చెందిన సీనియ‌‌‌‌ర్ అధికారులు ప్రారంభించారు. వారిలో ఎస్ఈ జీఎస్ సెంట్రల్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియాస్ ష్మిడ్ట్, జీఎస్‌‌‌‌సీ క‌‌‌‌మోడిటీ మేనేజ్‌‌‌‌మెంట్ విభాగాధిప‌‌‌‌తి టిమ్ క్లెయిన్‌‌‌‌హెయ‌‌‌‌ర్‌‌‌‌, ఇతర అధికారులు ఉన్నారు. 

ఆజాద్ ఇంజినీరింగ్ చైర్మన్ పీవీఎస్ రాజు, సీఈఓ రాకేష్ చొప్దార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రంలో 150 మందికి పైగా నిపుణులు పనిచేస్తారు. ఈ సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 230కి పెరుగుతుందని ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది.