రూ.1 చిల్లర లేదన్న కండక్టర్..ఫైన్ వేసిన కోర్టు

రూ.1 చిల్లర లేదన్న కండక్టర్..ఫైన్ వేసిన కోర్టు

మనం మామూలుగా బస్సులో ప్రయాణిస్తున్నపుడు కండక్టర్ చిల్లర లేదని ఒక రూపాయి ఇవ్వకుండా వెళ్లిపోయిన సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అలా ఊరుకొని వెళ్లలేదు. ఆ ఒక్క రూపాయి కోసం న్యాయపోరాటం చేసి, ఫైనల్ గా విజయం సాధించాడు. ఆర్టీసీ బస్సు కండక్టర్ రూ.1 చిల్లర ఇవ్వలేదని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. 2019లో రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుండి మెజెస్టిక్ బస్ డిపోకు BMTC బస్సులో ప్రయాణించాడు, ఆ సమయంలో కండక్టర్ రూ. 29కి టిక్కెట్ ఇచ్చాడు. కానీ రమేష్ రూ. 30 చెల్లించాడు. దానికి కండక్టర్ .. తన దగ్గర రూపాయి చిల్లర లేదని చెప్పాడు. దాంతో పాటు ఆ వ్యక్తిపై కండక్టర్ దుర్భాషలాడాడు కూడా. దీంతో మనస్తాపానికి గురైన రమేష్.. తనకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కానీ రమేష్ ఫిర్యాదును స్వీకరించకపోగా కండక్టర్ కే సపోర్టు చేసింది. సర్వీస్‌లో లోపం ఉందన్న ఆరోపణలతో పిటిషన్ ను కొట్టిపారేసింది.

ఈ ఘటనతో రమేష్ (బీఎంటీసీ)బెంగళూరు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చింది. అనంతరం వాదనలు విన్న కోర్టు.. కండక్టర్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దాంతో పాటు ఫిర్యాదుదారుడికి ప్రస్తుతం రూ.2,000  చెల్లించాలని, లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బెంగళూరు కోర్టు (బీఎంటీసీ)తెలిపింది. ఈ సమస్యను లేవనత్తడం చిన్నదిగా అనిపించినా..  అది ఫిర్యాదుదారుని హక్కుగా కోర్టు సంభోదించడమే కాకుండా, ఈ పని చేసినందుకు అతన్ని మెచ్చుకుంది కూడా. రమేష్ మొత్తం రూ.15వేలు నష్ట పరిహారం కోరగా దాంట్లో రూ.2వేలు ఇప్పుడు చెల్లించాలని.. మరో 45రోజుల్లో మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేని క్రమంలో సంవత్సరానికి రూ. 6వేల వడ్డీ రేటు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.