
యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. విమాన సిబ్బందిని కత్తితో బెదిరించి గాలిలో ఉన్న విమానం ఎమర్జెన్సీ తలుపులు తెరవబోయాడు. అతన్ని ముందే గుర్తించిన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకొని హెచ్చరిచారు. దాంతో పెద్ద ప్రామాదం తప్పింది. మసాచుసెట్స్ లోని లియోమిన్ స్టర్ కు చెందిన ఫ్రాన్సిస్కో సెవెరో టోర్రెస్ (33) లాస్ ఏంజిల్స్ నుంచి బోస్టన్ కు యునైటెడ్ ఎయిర్ లైన్స్ ద్వారా ప్రాయాణించాడు.
విమానంలో తప్ప తాగిన ఫ్రాన్సిస్కో సెవెరో.. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని కొంత భాగం తెరిచాడు. లాక్ హ్యాండిల్ ని తిప్పేసరికి ఎమర్జెన్సీ సైరన్ మోగి సిబ్బందికి సిగ్నల్ పోయింది. విషయం తెలుసుకొని ఫ్రాన్సిస్కోను అడ్డుకున్నాురు. దాంతో కోపం రావడంతో ఫ్రాన్సిస్కో కత్తితో సిబ్బంది మెడపై పొడవబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఫ్రాన్సిస్కోను అదుపు చేసి అందరినీ కాపాడారు. తర్వాత అతన్ని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి కోర్టుకు తరలిచారు.