ప్రేమించిన అమ్మాయితో పెండ్లి కాలేదని యువకుడి సూసైడ్

ప్రేమించిన అమ్మాయితో పెండ్లి కాలేదని యువకుడి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: తను ప్రేమించిన అమ్మాయితో పెండ్లి కాలేదనే మనస్తాపంతో  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సూరారం పోలీసులు తెలిపిన ప్రకారం... బిహార్​కి చెందిన తన్వీర్​ఖాన్​ (27) ఓ అమ్మాయిని ప్రేమించగా పెద్దలు పెండ్లికి ఒప్పుకోలేదు. వేరే అమ్మాయితో అతనికి పెండ్లిచేయగా కూతురు జన్మించింది.  కుటుంబంతో బిహార్​లోనే ఉంటుండగా.. మూడు నెలల కిందటి  సూరారంలోని తన అంకుల్ ఇంటికి వచ్చి పెయింటింగ్ పని చేస్తున్నాడు.

 ఇంట్లో ఎవరూ లేనప్పుడు తన్వీర్ ఖాన్​ ఉరేసుకోగా.. శనివారం అతని అంకుల్​ ఇంటికి వచ్చి చూశాడు.  తన్వీర్ ఖాన్​ఉరేసుకుని కన్పించడంతో వెంటనే కిందకి దించి చూడగా అప్పటికే చనిపోయాడు. ప్రేమించిన అమ్మాయితో పెండ్లి కాలేదనే మనస్తాపంతోనే తన్వీర్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.