మద్యంమత్తులో యువతిపై వేధింపులు.. పోలీసులతో వాగ్వాదం

మద్యంమత్తులో యువతిపై వేధింపులు.. పోలీసులతో వాగ్వాదం

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా అన్నోజిగుడాలో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మద్యంమత్తులో రాత్రి రోడ్డుపై వెళ్తున్న అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగుడా నవోదయ స్కూల్ సమీపంలో జరిగింది. అన్నాజీగుడలోని విక్రమ్ (18) అనే యువకుడు రిలయన్స్ డిజిటల్ లో పనిచేస్తున్నాడు. రాత్రి డ్యూటీ ముగిశాక మద్యం సేవించి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న శిల్ప అనే అమ్మాయిని నవోదయ స్కూల్ సమీపంలో అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

విక్రమ్ దారి మధ్యలో వేదించిన విషయాన్ని శిల్ప మొదట తన అన్న ప్రభుకు తెలిపింది. తర్వాత డయిల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడు విక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా విక్రమ్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ మేరకు పోలీసులు విక్రమ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.