35 ఏళ్ల తర్వాత అమ్మ గొంతు విన్నడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

35 ఏళ్ల తర్వాత అమ్మ గొంతు విన్నడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 35 ఏళ్ల తర్వాత.. ఓ వ్యక్తి తల్లి గొంతును విన్నాడు. ఎమోషనల్ గా ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది. కొడుకు పేరు చెప్పిన ఆ తల్లి.. ‘వినపడుతోందా ?’ .. అంటే ‘ఎస్’ అంటూ థంబ్ చూపిస్తున్న వీడియో అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. దీనికి 1.3 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఆ వ్యక్తికి రెండేళ్ల వయసులో మెనింజైటిస్ వల్ల వినికిడి లోపం వచ్చింది. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత అతని పక్కన తల్లి కూర్చొంది. 

'ఎడ్వర్డో, ఎడ్వర్డో, ఎడ్వర్డో' అంటూ చెప్పడం వీడియోలో కనిపించింది. అప్పటికే అతను కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇంకా వినిపిస్తలేదోమోనని తల్లి కంగారు పడింది. పేరును పదే పదే చెబుతుండడం ఆ వీడియోలో చూడొచ్చు. గొంతు వినగలనని కొడుకు సైగ చేయడంతో.. ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. అక్కడున్న కుటుంబసభ్యులు సైతం కంటతడి పెట్టారు. goodnews movement  అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.