రెండేళ్ల చిన్నారి ఐదో అంతస్తులోని కిటికీ లో నుంచి ప్రమాదవశాత్తు జారింది. అక్కడున్న వారు చిన్నారి బతకదు అనుకున్నారు. కానీ అక్కడే ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. చిన్నారి పడుతుండగా ఓ వ్యక్తి చూశాడు. వెంటనే పడుతున్న ప్రాంతానికి వేగంగా పరుగులు తీశాడు. ఆ చిన్నారిని సేఫ్ గా పట్టుకున్నాడు. Lijian Zhao 赵立坚 ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందరూ అతడిని హీరోగా పొగుడుతున్నారు. చైనాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
యువతీ, యువకులు రోడ్డుపై నిల్చున్నారు. అతడు ఫోన్ లో మాట్లాడుతూ.. ఎందుకో పైకి చూశాడు. ఐదంతస్తుల భవనం కిటికీ వద్ద ఓ చిన్నారి ఉంది. ఏమైందో ఏమో కానీ.. కిటికీలో నుంచి చిన్నారి జారింది. ఫోన్ లో మాట్లాడుతూనే భవనం కిందకు వచ్చాడు. ఓ సమయంలో జారిపడిపోయాడు. కానీ.. జాగ్రత్త పడడంతో నిల్చున్నాడు. అప్పటికే చిన్నారి చేయి జారిపోయింది. అమాంతం పై నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చింది. ఫోన్ తీసేసి.. పక్కనే యువతిని అలర్ట్ చేశాడు. చేతులు పైకి లేపట్టి.. కింద పడిపోతున్న చిన్నారిని సేఫ్ గా పట్టుకున్నాడు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నెటిజన్లు అతడిని హీరోగా పొగుడుతున్నారు.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
