ప్రియుడితో భార్య.. మంచం కింద దాక్కున్న భర్త

ప్రియుడితో భార్య.. మంచం కింద దాక్కున్న భర్త

తన భార్య మరో యువకుడితో అక్రమసంబంధం పెట్టుకోవడంతో.. ఆ వ్యక్తిని ప్లాన్ ప్రకారం హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలో జరిగింది. నేలమంగళ నివాసి అయిన భరత్ కుమార్ (31)కు వినుతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా.. తారికెరే తాలూకాలోని హోసహల్లి తాండ్యాకు చెందిన శివకుమార్.. వినుతకు స్నేహితుడు. అతడు ఉద్యోగ కోసం బెంగుళూరు వచ్చినప్పడు వినుత ఇంట్లో మూడు రోజులు ఉన్నాడు. ఆ సమయంలో శివకుమార్.. వినుతతో సన్నిహితంగా ఉన్నాడు. దాంతో భరత్.. శివకుమార్ మరియు వినుతతో గొడవపడ్డాడు. 

అప్పటినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో వినుత భరత్ కుమార్‌ను వదిలి ఆంధ్రహళ్లిలో ఒక అద్దెకు దిగింది. శివకుమార్ అక్కడికి వారానికి రెండు మూడుసార్లు వస్తుంటాడు. తన భార్య తనను విడిచిపోవడానికి కారణమైన శివకుమార్‌ను అంతమొందించాలని భరత్ కుమార్ పథకం వేశాడు. అందులో భాగంగా బుధవారం శివకుమార్.. వినుత ఇంటికి వస్తాడని తెలుసుకున్న భరత్.. వినుత ఇంటి దగ్గరికెళ్లాడు. శివకుమార్ వస్తాననడంతో.. వినుత ఇంటికి లాక్ చేయకుండా చికెన్ తేవడానికి బయటకు వెళ్లింది. అది గమనించిన భరత్.. ఎవరి కంటపడకుండా ఇంట్లోకి వెళ్లి మంచం కింద దాక్కున్నాడు.

రాత్రి 10.30 గంటలకు శివకుమార్ వచ్చిన తర్వాత వినుత, శివకుమార్‌లు కలిసి భోజనం చేసి పడుకున్నారు. వారు పడుకున్న మంచం కింద ఉన్న భరత్.. సమయం కోసం 6 గంటలపాటు అక్కడే ఎదురుచూశాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వినుత వాష్ రూంకి వెళ్లింది. వెంటనే తేరుకున్న భరత్.. వాష్ రూం గడియ పెట్టి.. శివకుమార్ మీద కత్తితో దాడి చేసి హతమార్చాడు. వినుత ఫిర్యాదుతో పోలీసులు భరత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.