మా వైఫ్ టెర్రరిస్ట్..ఆమెను అడ్డుకోండి..

మా వైఫ్ టెర్రరిస్ట్..ఆమెను అడ్డుకోండి..

తన భార్య టెర్రరిస్టు.. ఫ్లైట్ లో బాంబ్ పెట్టేందుకు వెళ్తుందని ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 8న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టు సిబ్బంది  ఫ్లైట్స్ అన్నింటిని ఆపి తనిఖీలు చేయగా.. ఎక్కడా కూడా బాంబ్ దొరకలేదు. అసలు ఆ ఫేక్ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చిందని ఆరాతీసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. చెన్నైలో బ్యాగుల తయారీ సంస్థ యజమాని  నసిరుద్దీన్ కు కొన్నేళ్ల కిందట రఫియా అనే యువతితో వివాహం అయ్యింది. రఫియా గల్ఫ్ కంట్రీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంది.  అయితే భార్య గల్ఫ్ వెళ్లడం నజిరుద్దీన్ కు ఇష్టం లేదు.  భార్యను ఎలాగైనా గల్ఫ్ వెళ్లకుండా ఆపాలనుకున్న నసిరుద్దీన్.. తన భార్య టెర్రరిస్ట్ అని, దుబాయ్ లేదా సౌదీ అరేబియా వెళ్లే  ఫ్లైట్ లో బాంబ్ పెట్టేందుకు వెళ్తుందని   పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అలర్ట్ అయిన పోలీసులు ఢిల్లీలోని ఎయిర్ పోర్టు సబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది ఫ్లైట్స్ ను ఆపి తనిఖీలు చేయగా ఎందులో కూడా బాంబ్ దొరకలేదు. దీంతో  ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కాల్ ఎవరు చేశారని పోలీసులు విచారణ జరపగా  నసిరుద్దీన్ అనే వ్యక్తి చేసినట్లు తేలింది. ఎందుకు చేశావు అని పోలీసులు అతడిని అడగగా.. విదేశాలకు వెళ్తున్న తన భార్యను అడ్డుకునేందుకే చేశానని నసిరుద్దీన్ ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.