
హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్ వద్ద ఓ వ్యక్తి శుక్రవారం హల్‌చల్ చేశాడు. వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ సురేశ్ చిట్ ఫండ్ పేరుతో మోసం చేశాడంటూ నిరసనకు దిగాడు. తాను అతని బాధితుడినంటూ హంగామా చేశాడు. కాగా, సురేశ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతను కాంగ్రెస్‌లో చేరడాన్ని నిరసిస్తూ ఆ వ్యక్తి పెట్రోల్ డబ్బాతో బెదిరించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, స్టేషన్‌కు తరలించారు.