గుజరాత్ లో దారుణం.. భార్యను చంపేసి 10 కి.మీ స్కూటీపై తీసుకెళ్లాడు

గుజరాత్ లో దారుణం.. భార్యను చంపేసి 10 కి.మీ స్కూటీపై తీసుకెళ్లాడు

గుజరాత్ : పెళ్లైన ఏడాదికే భార్యను కిరాతకంగా చంపాడో దుర్మార్గుడు. ఈ సంఘటన గుజరాత్ లో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. రాజ్ కోట్ సమీపంలోని వెరవాల్ గ్రామానికి చెందిన హేమ్ నాని, నైనా దంపతులకు గత ఏడాది పెళ్లయ్యింది. హూమ్ నాని స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. అయితే ఆదివారం భార్యతో గొడవపడ్డ హేమ్ నాని.. మాటామాటా ముదరడంతో గొడవ పెద్దదైంది. దీంతో హేమ్‌ నాని సీరియస్ తో భార్య గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని స్కూటీ మీద వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్తుండగా గ్రామస్ధులు గమనించారు.

స్టీరింగ్‌, ఫూట్‌ రెస్ట్‌ కి మధ్య నైనా డెడ్ బాడీని పెట్టి స్కూటీపై తీసుకెళ్లి పాతిపెడుదామనుకున్నాడు. ఈ క్రమంలోనే స్కూటీపైనే డెడ్ బాడీని 10 కిలీమీటర్ల దూరం వెళ్లాడు.ఆమె కాళ్లు నేల మీద ఉన్నా.. ఇదేం పట్టించుకోకుండా అలానే లాక్కెళ్లాడంతో గమనించిన గ్రామస్థులు.. హేమ్ నానిని అడ్డగించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించామన్నారు.