వీడికేమైంది.. పాముకే ముద్దులు పెడుతున్నాడు..

వీడికేమైంది.. పాముకే ముద్దులు పెడుతున్నాడు..

పామును చూస్తే జనాలు  వణికిపోతారు. కానీ ఫారెస్టు అధికారులు, పాములు పట్టేవాళ్లు విచ్చలవిడిగా పాములను పట్టుకుని అడవుల్లో వదలడం మనం చూశాం. ఇప్పుడు  ఓ యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకుని నుదిటిపై ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

పాము మీ కళ్ల ముందు కనిపిస్తే ఏం చేస్తారు.. బాబోయ్ అని పరుగులు తీస్తారు. ధైర్య వంతులైతే పాము జోలికి వెళ్లకుండా కొంత దూరం నుంచి వెళ్తారు. ఇంకొందరు భయంతో కర్ర తీసుకుని వాటిపై అటాక్ చేస్తారు. మరి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలాడటం ఎప్పుడైనా చూశారా? పాములను రెచ్చగొట్టి కాటు వేయించుకోవడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూడండి.

పాముల్లో  కింగ్ కోబ్రా....

 పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. ఈ రోజుల్లో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒకటి రెండు కాదు చాలా కింగ్ కోబ్రాస్ కనిపిస్తున్నాయి. వీటితో ఒక వ్యక్తి వింత పనులు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన జనాలు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం పాముల కంటే డేంజర్‌లా ఉన్నాడు. అవును మరి. ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాల మధ్యకు వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా.. వాటిని రెచ్చగొడుతూ తన తలపై కాటు వేయించుకున్నాడు. వింత వింత గా ప్రవర్తిస్తూ ఆ పాములను కోపం తెప్పించాడు. అయితే, కాసేపటి తరువాత ఆ పాముల్లో కూడా మార్పు వచ్చింది. అతను ఏం చేసినా అవి పెద్దగా పట్టించుకోలేదు.

పాములకు ముద్దులు

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో, ఒక వ్యక్తి .. ఒకటి లేదా రెండు కాదు, 5 కింగ్ కోబ్రాస్ ఉన్నట్లు చూడవచ్చు. ప్రమాదకరమైన ఈ పాములకు భయపడకుండా వాటితో వికృత చేష్టలు చేయిస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీకు గూస్‌బంప్స్ రావడం ఖాయం. అంతే కాదు ఒక్కొక్క కింగ్ కోబ్రాను తన చేతుల్లోకి తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
 
వీడియో వైరల్

ఆ వ్యక్తి తన చేతుల్లోకి కింగ్ కోబ్రాను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం కూడా వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో Instagram ఖాతా @earth.reel నుండి షేర్ చేయబడింది. వీడియోతో పాటు వ్యక్తి చర్యపై మీ అభిప్రాయం ఏమిటి అని వినియోగదారు అడిగారు. ఈ వీడియోపై జనాలు చాలా రియాక్షన్స్ ఇచ్చారు. నాగుపాముతో ఎవరైనా ఇలాంటి పని ఎలా చేస్తారని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మూర్ఖత్వంగా అభివర్ణిస్తూ.. ఇలాంటి పని ఎవరూ చేయవద్దని కొందరు యూజర్లు అన్నారు.

అతను తన రెండు చేతులతో రెండు పాములను పట్టుకుని తన కళ్లతో వాటి కళ్లలోకి చూశాడు. మరోవైపు.. కింద ఉన్న మరో పాము దగ్గరకు వచ్చి దానికి ముద్దు పెట్టాడు. ఆపై లేచి పాములకు నమస్కరించాడు. ఈ భయానక, ఆశ్చర్యకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసి నెటజిన్లు అవాక్కవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

https://www.instagram.com/reel/Ctv9k41JxPZ/?utm_source=ig_web_copy_link