లిఫ్ట్‪లో కాలు ఇరుక్కొని రెండున్నర గంటలు అలాగే

లిఫ్ట్‪లో కాలు ఇరుక్కొని రెండున్నర గంటలు అలాగే

ఎక్కువ అంతస్తులు ఉన్న బిల్డింగులకు సులభంగా చేరుకోవడానికి లిఫ్టులు ఏర్పాటు చేస్తుంటారు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెస్ట్ బెంగాల్ లోని కలకత్తాలో ఈ రోజు (మార్చి 14) 44 ఏళ్ల  వ్యక్తి కాలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. అలీపూర్ ట్రెజరీ ఆఫీస్ లోని నాలుగు, ఐదో అంతస్తులో సహబుద్దీన్ మొల్లా కాలు ఇరుక్కుపోయి రెండున్నర గంటల సేపు అలాగే ఉండిపోయాడు. ఐదవ ఫ్లోర్ కు వెళ్తుండగా.. ఆ ఫ్లోర్ కు వెళ్లి లిఫ్ట్ ఆగిపోయింది. అతను అడుగు బయట పెట్టగానే ఒక్కసారిగా లిస్ట్ కిందకి వెళ్లింది. 

తనతోపాటు మరో 10 మంది కూడా లిఫ్ట్ లో ఉన్నారు. పోలీసులు డిజాస్టర్ మ్యానేజ్‌మెంట్ బృందాన్ని  పిలిపించారు. వారు అక్కడికి చేరుకొని లిఫ్ట్ ఐరన్ గేట్ కత్తిరించారు. ఫైర్, డిజాస్టర్ మ్యానేజ్ మెంట్  సిబ్బంది 2 గంటలు శ్రమించి మొల్లాని రక్షించారు. వెంటనె అతన్ని హాస్పిటల్లో చేర్పించారు.