ఒక్కసారిగా పరేషాన్.. క్షణాల్లో ఫోన్ మాయం..

 ఒక్కసారిగా పరేషాన్.. క్షణాల్లో ఫోన్ మాయం..

బీహార్ లో మూవింగ్ ట్రైన్ నుంచి ఫోన్ కొట్టేసిన వీడియో వైరల్ గా మారింది.  ఇద్దరు ప్రయాణికులు ట్రైన్ కంపార్ట్ మెంట్ డోర్ దగ్గర కూర్చున్నారు. ఓ వ్యక్తి ట్రైన్ బ్రిడ్జి పైనుంచి వెళ్తుండగా గంగా నది అందాలను క్యాప్చర్ చేస్తున్నాడు. అయితే వీడియో తీస్తుండగా..సడెన్ గా చేతిలోంచి ఫోన్ మాయమైంది. ఏమైందని తేరుకునే లోపే ఫోన్ ని దొంగ కొట్టేశాడు.  వీడియోను స్లో మోషన్ లో చూస్తే గానీ..అర్థంకానంత ఫాస్ట్ గా ఫోన్ చోరీ చేశాడు దొంగ. బ్రిడ్జి ఫ్రేమ్ పైన వేలాడుతూ.. ఫోన్ కొట్టేసేందుకు ఓపికగా వేచి చూస్తున్నాడు. ప్యాసింజర్ చేతిలో ఫోన్ చూడగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ లోని దాన్ని కొట్టేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా దొంగను స్పైడర్ మ్యాన్ తో పోలుస్తున్నారు.