గున్ గల్ అటవీ ప్రాంతంలో వ్య‌క్తి దారుణ హత్య

గున్ గల్ అటవీ ప్రాంతంలో వ్య‌క్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హ‌త్య జ‌రిగింది. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అమీర్ పెట సత్తయ్య(40) అనే వ్య‌క్తి ని కొంద‌రు వ్య‌క్తులు చంపిన‌ట్టు మృతుడి కొడుకు శంకర్ తెలిపాడు. గురువారం రాత్రి సమయంలో స‌త్తయ్య‌ రియల్ ఎస్టేట్ బిజినెస్ పార్ట‌న‌ర్స్ ఫోన్ చేసి, భూమి విషయం మాట్లాడాలని పిలిచార‌నిని, ఆ త‌ర్వాత‌ పథకం ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత‌ని ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం, ఎల్బీనగర్ డీసీపి సం ప్రీత్ సింగ్ పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.