జైన గురువు రూపంలో వచ్చి.. వజ్రాలు, రత్నాలు పొదిగిన కోటి రూపాయల కలశం నొక్కేశాడు

జైన గురువు రూపంలో వచ్చి.. వజ్రాలు, రత్నాలు పొదిగిన కోటి రూపాయల కలశం నొక్కేశాడు

ఢిల్లీ ఎర్ర కోట పార్కు.. 24 గంటలూ ఫుల్ సెక్యూరిటీ ఉండే ఏరియా. ఆ రూట్ లో వెళ్లాలంటేనే దొంగలు భయపడే బందోబస్తు ఉంటుంది. అలాంటిది.. అక్కడి నుంచి ఏకంగా కోటి రూపాయల విలువైన కలశాన్ని నొక్కేశాడు ఓ కేటుగాడు. ఢిల్లీలో ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

శనివారం (సెప్టెంబర్ 06) ఒకవైపు జైన మత వేడుకలు జరుగుతుండగా.. అదే అదనుగా భావించి.. జైన మత గురువుగా ఎంటరయ్యాడు దొంగ. అంత విలువైన వస్తువును కొట్టేయాలంటే జైన గురువుగా వెళ్లడమే సేఫ్ అని ఎప్పట్నుంచి ప్లాన్ వేసుకున్నాడో కానీ.. సైలెంట్ గా పనికానిచ్చుకుని వెళ్లిపోయాడు.

జైన గరువులాగా వేషధారణ మార్చుకుని.. భుజానికి ఒక సంచి వేసుకుని వేడుకలోకి ఎంటరయ్యాడు. గురువు వస్తున్నారని సాదరంగా ఆహ్వానించి సపరిచర్యలు చేశారు భక్తులు. అందరూ కోలాహలంలో, ఆనందోత్సాహంలో ఉండగా.. ఎప్పుడో కలశాన్ని మాయం చేశాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, కెంపులు పొదిగి ఉన్న ఆ కలశం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. 

►ALSO READ | ఢిల్లీలో బీహార్ జ్యోతిష్యుడు అరెస్ట్: ఇతను చేసిన పని తెలిస్తే.. ఎవరికైనా ఒళ్లు మండటం ఖాయం !

ఎర్ర కోట పార్కు గేటు నెం.15 దగ్గర.. శనివారం కోటి రూపాయల కలశాన్ని ఎత్తుకెళ్లినట్లు జైన వేడుక ఆర్గనైజర్ పునీత్ జైన్ తెలిపాడు. నిందితుడు ఇదివరకే మత గురువులా వచ్చి మూడు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజ్ లో.. జైన గురువు వేషంలో వెళ్తున్న దొంగను గుర్తించారు పోలీసులు. 

బంగారంతో చేసిన జారీ 760 గ్రాములు ఉంటుందని.. చుట్టూ వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు అంటించి ఉంటాయని పోలీసులు తెలిపారు.  ప్రతిరోజు వేడుక కోసం వ్యాపారి సుధీర్ జైన్ ఆ కలశాన్ని తెస్తుంటాడని తెలిపారు. గత మంగళవారం కార్యక్రమం మధ్యలో కలశం మాయమైనట్లు గుర్తించామని తెలిపారు. దొంగకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫూటేజ్ లో నమోదయ్యాయని.. త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.