బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు

కంది, వెలుగు : ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఓ వ్యక్తికి 20 ఏండ్లు జైలుతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్ట్‌‌‌‌‌‌‌‌ జడ్జి జయంతి సోమవారం తీర్పు చెప్పారు. పటాన్‌‌‌‌‌‌‌‌చెరువు పట్టణంలోని ఆల్విన్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన ఇటిక్యాల నవీన్‌‌‌‌‌‌‌‌ 2018లో పక్క ఇంట్లో ఉండే ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. పటాన్‌‌‌‌‌‌‌‌చెరువు అప్పటి ఎస్సై ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నవీన్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

 విచారణ అనంతరం నవీన్‌‌‌‌‌‌‌‌పై నేరం నిరూపణ కావడంతో జైలు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా కట్టకపోతే మరో సంవత్సరం పాటు జైలు శిక్ష పొడిగించబడుతుందని తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ సీతారాం, సీఐ ప్రభాకర్, కోర్ట్‌‌‌‌‌‌‌‌ ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుళ్లు వెంకటేశం, కిషన్‌‌‌‌‌‌‌‌ను ఎస్పీ రూపేశ్‌‌‌‌‌‌‌‌ అభినందించారు.