మంథని, వెలుగు : అన్న పై తమ్ముడు పెట్రోల్ పోసి దాడి చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో లక్కేపూర్ గ్రామం లో జరిగింది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంథని మండలం లక్కెపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘు(28) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని సోదరుడు అనిల్ శనివారం తెల్ల వారు జామున పెట్రోల్ పోసి అంటించాడు. దీంతో రఘు కేకలు వేసుకుంటూ రోడ్డు మీదకు రావడం తో గమనించిన స్థానికులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
శరీరం ఎక్కువగా కాలిపోవడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత సోదరుడి పై పెట్రోల్ పోసి తమ్ముడు తగలబెట్టాడని పలువురు చర్చించుకుంటున్నరు. రఘు సోదరి సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై డేగ రమేశ్ తెలిపారు.

