లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులిస్తూ .మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం సూచించింది. కొన్ని ప్రాంతాల్లోనే.. కనీస దూరం పాటిస్తూ.. మద్యం కొనుగోలు చేయాలని తెలిపింది. దాదాపు 40 రోజుల తర్వాత తెరుచుకోవడంపై మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఢిల్లీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు షాపులు తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చందర్ నగర్‌లో మంగళవారం ఉదయం ఈ అద్భుత దృశ్యం కనిపించింది.
లిక్కర్ కోసం క్యూలైన్లలో నిల్చున్న మద్యం ప్రియులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపిస్తూ వెళ్లాడు. చేతిలో పూల కవర్ తో వచ్చి షాపు ముందు బారుల తీరిన జనం మీద ఒక్కొక్కరిపై చల్లాడు. ‘ఈ దేశానికి మీరే దిక్కు. దేశలోని సంపదంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ దగ్గరే ఏమీ లేదు.. ’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. నమస్కారాలు కూడా పెట్టాడు. ఇందుకు సంబధించిన వీడియో వైరల్ అవుతోంది.
#WATCH Delhi: A man showers flower petals on people standing in queue outside liquor shops in Chander Nagar area of Delhi. The man says, "You are the economy of our country, government does not have any money". #CoronaLockdown pic.twitter.com/CISdu2V86V
— ANI (@ANI) May 5, 2020
