వాగులో జారిపడ్డడు..ఈత రావడంతో బతికి బయటపడ్డడు

వాగులో జారిపడ్డడు..ఈత రావడంతో బతికి బయటపడ్డడు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగులో సెప్టెంబర్ 16న  తెల్లవారుజామున ఓ వ్యక్తి వాగు దాటుకుంటూ   జారిపడ్డాడు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో కొద్ది దూరం వాగులో కొట్టుకుపోయాడు. అతనికి ఈత రావడంతో కొద్ది దూరం వెళ్లి చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరాడు.దీంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

 తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, వరంగల్, హైదరాబాద్ లో వర్షం పడింది. ఇంకా కొన్ని జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది.

 మరో వైపు తెలంగాణలో సెప్టెంబర్ ఇవాళ( 16) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  యెల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ . మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.