ఫొటో కోసం వచ్చి వందేభారత్ ట్రైన్లో ఇరుక్కుపోయిండు

ఫొటో కోసం వచ్చి వందేభారత్ ట్రైన్లో ఇరుక్కుపోయిండు

జీవితంలో ఒక్కోసారి ఒకటి చేయబోయి ఇంకేదో జరిగి నవ్వులపాలవుతుంటారు. అలాంటి ఫన్నీ సన్నివేశం ఒకటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. రాజమండ్రి స్టేషన్ లో ఏదో సరదాగా వందే భారత్ రైలెక్కి ఫోటో దిగుదామనుకున్న ఒకాయన చిక్కుల్లో పడ్డాడు. ట్రైన్ నుంచి దిగుదామనుకునేలోపే డోర్ క్లోజ్ కావడంతో రైలులో ఉండిపోయాడు. ఏం చేయాలో అర్థంకాక డోర్ దగ్గర నిలబడి తెరవడానికి ప్రయత్నించాడు. అంతలో టీసీ రావడంతో సార్ ట్రైన్ డోర్ తెరవండని అభ్యర్థించారు. 

‘ ట్రైన్ తలుపులు తెరవలేరు. స్టేషన్ వచ్చినప్పుడు, స్టేషన్ నుంచి వెళ్తున్నప్పుడు ఆటో మెటిగా ఓపెన్, క్లోజ్ అవుతాయి. ఇక నువ్వు విజయవాడలో దిగాల్సిందే. ఫైన్ కట్టి కూర్చో’ అంటూ టీసీ చావు కబురు చల్లాగా చెప్పాడు. అది విన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఇప్పుడు రైల్ టికెట్ ఖర్చు+ పెనాల్టీ ఖర్చు + తిరుగు ప్రయాణం ఖర్చు= ఒక ఫోటో’ అని,  ‘జీవితంలో మళ్లీ సెల్ఫీ కోసమంటూ ఏ ట్రైన్ ఎక్కడు’ అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.