
హైదరాబాద్‌లో ప్రిపేర్ అవుతున్న జగిత్యాల జిల్లా యువకుడు
జగిత్యాల(మల్యాల), వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువకుడు జాబ్ రాక మనస్తాపంతో స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మ్యాదరి స్వామి-విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు నవీన్ ఉన్నారు. స్వామి కొన్నేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు.
కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా, కొడుకు నవీన్ హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. నవీన్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ జర్నలిజం ఎంట్రెన్స్‌లో 8వ ర్యాంకు సాధించాడు. ఎమ్మెస్సీ కూడా పూర్తి చేశాడు. ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తూ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కొన్ని పరీక్షలు రాశాడు.. జాబ్ రాకపోవడంతో మనస్తాపానికి గురై గ్రామంలోని సొంతింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.